ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన సామాన్య కార్యకర్త దగ్గర నుండి ఎమ్మెల్యేల వరకు ఏ ఒక్కర్ని విడిచిపెట్టకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ సర్కారు పలు అక్రమ కేసులను బనాయిస్తున్న సంగతి తెల్సిందే .
అందులో క్రమంగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బినామీ ఆస్తుల కేసుల వ్యవహారంలో ఈ రోజు మంగళవారం ఏసీబీ ముందు హాజరయ్యారు .
అయితే గతంలో ఏసీబీకి పట్టుబడిన గుంటూరు డీఎస్పీ దుర్గాప్రసాద్ కు చెందిన అక్రమాస్తులలో ఆర్కే కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయని అప్పట్లో ఏసీబీ కేసు ఫైల్ చేసింది .అయితే వీటి గురించి ఆర్కే ఎన్నికల అపిడవిట్ లో పెర్కొన్నారా లేదా అనే అంశం మీద ఏసీబీ విచారించనున్నది .