వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్నది.జగన్ తన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రైతులతో ఇవాళ మమేకమయ్యారు. ఈరోజు ఉదయం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. బోడపాడు క్రాస్ మీదుగా ముదునూరు శివారు చేరుకున్న జగన్ అక్కడి రైతులతో మమేకమయ్యారు. రైతుల యోగక్షేమాలు విచారించారు.
అనంతరం, తలపాగా చుట్టుకుని, చాటలో ధాన్యాన్ని ఆయన తూర్పారబట్టడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రైతులను అన్ని విధాలుగా అదుకున్నారని.. రైతన్నల జీవితాలలో మళ్ళీ వెలుగులు రావాలంటే అయన తనయుడు జగన్ ముఖ్యమంత్రి కావాలి.. మేము జగన్ మోహన్ రెడ్డి ని వచ్చే ఎన్నికల్లో ముఖ్యమత్రిగా గెలిపించుకుంటామని అక్కడున్న రైతులు తెలిపారు.