ఇటీవల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వారికి స్పీకర్ కార్యాలయం నుండి పిలుపు వచ్చింది.ఈ నెల 29న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో భేటీ కానున్నారు. తాము లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసి చాలా రోజులు అయినప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ వైసీపీ ఎంపీలు ఇటీవల స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కోరారు. సమయం ఇస్తే స్పీకర్‌తో సమావేశం అవుతామని వారు కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ కార్యాలయం వైసీపీ ఎంపీలకు సమాచారం ఇచ్చింది. ఈ నెల 29న సాయంత్రం 5-6 గంటల మధ్య స్పీకర్‌ను కలవాలని ఎంపీలందరికీ ఈ-మెయిల్ పంపింది.ఈ వివరాలను ఎంపీ మిథున్ రెడ్డి మీడియాకు తెలిపారు.
