ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.దాదాపు ముప్పై ఏళ్లకు పైగా టీడీపీ పార్టీకి సేవలు అందించి ..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు.తెలంగాణ
ఏర్పడిన దగ్గర నుండి నేటివరకు గవర్నర్ గిరి వస్తుందని ..చంద్రబాబు తనకు న్యాయం చేస్తాడని కళ్ళు కాయలు కాసేలా మూడు యేండ్ల పాటు ఎదురుచూసిన టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ ఏడాది మార్చి నెలలో నిర్వహించిన టీటీడీపీ పోలిట్ బ్యూరో సమావేశాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోలిట్ బ్యూరో సభ్యుడు ,సీనియర్ నేత అయిన మోత్కుపల్లి లేకుండానే సమావేశం నిర్వహించడంతో ఆయన తీవ్ర ఆవేదన చెందారు.అందులో భాగంగా మోత్కుపల్లి ప్రెస్ మీట్ పెట్టి మరి టీడీపీ పార్టీ రాష్ట్రంలో బ్రతికి బట్ట కట్టే పరిస్థితులు లేవు.ఉన్న నాయకులు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారు.అందుకే టీడీపీ పార్టీని టీఆర్ఎస్ లో వీలినం చేయాలనీ కూడా సలహా ఇచ్చారు.
అప్పటి నుండిఇటు టీటీడీపీ నేతలు ,అటు చంద్రబాబు నాయుడు మోత్కుపల్లి ను పక్కన పెట్టడం మొదలెట్టారు.దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మోత్కుపల్లి ఎన్టీఆర్ ఇష్యూ దగ్గర నుండి నేటి వరకు ప్రతి కష్ట సమయంలో బాబుకు అండగా ఉన్నందుకు తనకు సరైన ప్రతిఫలం ఇచ్చాడు అని ..పార్టీలో జరుగుతున్నా అవమానాలను తట్టుకోలేకే పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తన అనుచరుల దగ్గర వాపోతున్నాడు అంట .అన్ని అనుకున్నట్లు కుదిరితే వచ్చే నెలలో మంచి ముహూర్తం చూసుకొని కారేక్కాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ..