ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట అరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఇప్పటివరకు రెండు వేల కిలోమీటర్లను పూర్తి చేసుకున్నారు .
అయితే మరోవైపు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు .తాజాగా టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు జగన్ చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా పాదయాత్ర చేస్తున్నారు.
ఈ క్రమంలో హిందూపురం నియోజకవర్గానికి చెందిన సుమారు రెండు వేల ఐదు వందల కుటుంబాలు పార్లమెంటు సమన్వయ కర్త నదీం,పుట్టపర్తి,కదిరి సమన్వయ కర్తలు డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరారు.ఈ సందర్భంగా వీరందరికీ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .