ఏపీలో ఇటివల పర్యటించిన బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవాలయ పరిధిలో అలిపిరి వద్ద అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు దాడికి తెగబడిన సంగతి తెల్సిందే.సాక్షాత్తు జాతీయ పార్టీ అధ్యక్షుడు ,అది కేంద్ర అధికార పార్టీ నేతపై దాడికి తెగబడటంతో ఈ సంఘటనను కేంద్ర్ర సర్కారుతో పాటుగా కేంద్ర హోం శాఖ
కార్యాలయం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది.
అంతే ఈ ఘటనపై నివేదిక కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది .దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర పోలీస్ శాఖ రంగంలోకి దిగింది.అయితే ఇక్కడే ఎవరు ఊహించని షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో పోలీస్ శాఖ.
అందులో భాగంగా అమిత్ షాపై దాడికి తెగబడింది ఆ పార్టీకి చెందిన నేతలే అంటూ ఏకంగా నగర బీజీపీ అధ్యక్షుడు కోలా ఆనంద్ బాబును అరెస్టు చేశారు పోలీసులు.అంతే కాకుండా ఏకంగా ఈ రోజు మంగళవారం ఆనంద్ బాబును కోర్టుకు హాజరుపరచాలని పోలీస్ శాఖ సిద్ధమైంది.అయితే తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిపై దాడికి తెగబడటమే కాకుండా ఏకంగా తమ పార్టీకి చెందిన నేతపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన నేతలు …