తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి, పకడ్బందీగా అమలు చేసిన రైతుబంధు పథకంపై బీజేపీ చిత్రమైన రాజకీయాలు చేస్తోంది. ఓ వైపు ఈ పథకంపై కామెంట్లు చేస్తూనే మరోవైపు ఈ పథకం విజయవంతం అయ్యేందుకు తామే కారణమని ప్రచారం చేసుకుంటుకున్న తీరుపై రైతన్నల్లో విస్మయం వ్యక్తం అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద 44 లక్షల మంది రైతులు దాదాపుగా రూ.4700 కోట్ల విలువైన చెక్కులు పొంది వాటిని విత్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టి ప్రణాళికబద్దంగా అమలు చేయడం వల్ల ఈ పథకం విజయవంతం అయింది.ఆర్‌బీఐతో ప్రత్యేక సంప్రదింపులు జరిపి, క్షేత్రస్థాయిలో బ్యాంకర్లతో సమన్వయం చేసుకొని, జిల్లా యంత్రాగాలకు తగు సూచనలు చేసి, ఉద్యోగుల సహాయ,సహకారాలతో రైతుబంధు పథకం విజయవంతం అయింది.
అయితే ఈ పథకంపై రకరకాల విమర్శలు చేసిన బీజేపీ నేతలు పథకం విజయవంతం అయిన తర్వాత మాత్రం ఆ సంబురాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి బండారుదత్తాత్రేయ విడుదలచ ఏసిన ప్రకటన ఇందుకు నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. ‘బ్యాంకుల్లో డబ్బులు లేవనే దుష్ప్రచారం సరికాదు. బ్యాంకుల్లో డబ్బులు లేవనే ప్రచారం సరికాదు. రైతుబంధు పథకం ద్వారా డబ్బులు అందించేందుకు తోడ్పడిన కేంద్ర ఆర్థికమంత్రిని, ఆర్‌బీఐ అధికారులను ప్రశంసిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాయం చేయడం లేదనే విమర్శలను మానుకోవాలి’ అని కోరారు. కాగా, ఎంతో పకడ్బందీగా చేసిన కార్యక్రమం విసయంలో ఘనతను తమసొంతం చేసుకుంటున్నారని అదే సామాన్యుల విషయంలో నగదు కొరతపై ఎందుకు స్పందించడం లేదని పలువురు సందేహిస్తున్నారు.