ఏపీలోని టీటీడీ ప్రధాన అర్చకుడు అయిన రమణ దీక్షితులు ఇటివల టీటీడీ పాలకమండలి తీసుకున్న సంచలన నిర్ణయంతో ప్రధాన అర్చక బాధ్యతల నుండి విరమించిన సంగతి తెల్సిందే .అయితే అంతకుముందు రమణ దీక్షితులు టీటీడీలో పలు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి .పింక్ డైమండ్ విషయంలో కూడా ఆలయ ఈవో చాలా విషయాలు దాచి పెడుతున్నారు .
ఇవన్నీ తెలిసి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు తగిన చర్యలు తీసుకోవడంలేదని ఆవేదనను వ్యక్తం చేశారు .అయితే టీటీడీలో జరుగుతున్నా పలు అవినీతి అక్రమాలపై టీడీపీ సర్కారు స్పందించకపోతే ఆమరణ దీక్షకు దిగుతాను అని ఆయన ప్రకటించారు అని వార్తలు వస్తున్నాయి .అయితే తనపై బురద
చల్లిస్తూ ఆస్థాన మీడియా ద్వారా తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా వార్తలను ప్రచారం చేయిస్తున్నారు.
టీటీడీలో జరుగుతున్నా అవినీతి అక్రమాలపై టీడీపీ సర్కారు విచారణ చేయించకపోతే ..కేంద్ర హోం శాఖ మంత్రిని కలుస్తాను ..ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ మహానగరం సాక్షిగా ఆమరణ దీక్ష చేసి దేశానికే కాకుండా యావత్తు ప్రపంచానికి టీటీడీలో జరుగుతున్నా అవినీతి అక్రమాలను తెలియజేస్తాను అని ఆయన మీడియాకు తెలిపారు.అయితే ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన పలు అవినీతి అక్రమాల వలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకున్న టీడీపీ సర్కారు ఇప్పుడు టీటీడీ భాగోతాలు బయటకు వస్తే తమ పరువు పోతుందని చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ వాపోతున్నారు అంట ..