పాదయాత్రలో ఉన్న జగన్‌కు పవన్ కళ్యాణ్‌కు హీరోయిన్ ఫోన్..! అసలు మేటర్ ఇదే భయ్యా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక స్లంప్‌లో ఉన్నప్పుడు రంగస్థలం చిత్రంతో వచ్చిన రామ్ చరణ్ ఆంజనేయ స్వామి కొండను ఎత్తినట్టు… సినీ ఇండస్ట్రీని ఒక్క చేత్తో అలా ఎత్తాడు. ఈ విషయాన్నే నా పేరు సూర్య చిత్రం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పాడు. అల్లు అర్జున్ చెప్పిన ఆ మాటలు నిజమే మరీ.? అప్పటి వరకు వరుస ప్లాప్‌లతో నష్టాల్లో మునిగిన టాలీవుడ్‌పై రంగస్థలం చిత్రం కనకవర్షం కురిపించింది. సినీ ఇండస్ట్రీలో ఒక నూతనోత్సాహానికి తెర తీసింది. ఆ తరువాత రిలీజైన సూపర్ స్టార్ మహేష్‌బాబు, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించింది. ఇలా కథల్లో వైవిధ్యాన్ని చూపుతూ తెరకెక్కే చిత్రాలను ఆదరించేందుకు మేమెప్పుడూ సిద్ధమే అన్న సంకేతాలను ఇచ్చారు సినీ జనాలు. ఆ నేపథ్యంలో సినీ అభిమానుల ఆదరణను చూరగొన్న చిత్రం మహానటి.
ఇదిలా ఉండగా… ఇటీవల కాలంలో సినీ జనాలు వైవిధ్య కథలతోపాటు, పలువురు ప్రముఖుల రియల్ స్టోరీలను ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే తెరకెక్కుతున్న చిత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బయోపిక్. యాత్ర అనే టైటిల్‌తో మహి రాఘవ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తయింది. ఇక మిగిలింది నటీ నటుల ఎంపికే.
అందులో భాగంగా దర్శకుడు మహి రాఘవ నటీనటుల కోసం వేట ప్రారంభించాడు. ఇప్పటికే వైఎస్ఆర్ పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ ముమ్మట్టిని తీసుకోగా.. వైఎస్ఆర్ పర్సనల్ అసిస్టెంట్ పాత్రలో పోసాని కృష్ణ మురళీ ఎంపికయ్యారు. అలాగే, వైఎస్ఆర్ కుమార్తె షర్మిల పాత్ర కోసం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషీ చిత్రం హీరోయిన్ భూమికను ఎంపిక చేశారట. అయితే, షర్మిల క్యారెక్టర్‌ను వెండితెరపై పండించేందుకు భూమిక ఇప్పటికే రిహాసల్స్ ప్రారంభించినట్లు సమాచారం. షర్మిల గురించి మరింత సమాచారం తెలుసుకునే క్రమంలో దర్శకుడు మహి రాఘవ సమక్షంలో భూమిక వైఎస్ జగన్‌ను ఫోన్‌లో సంప్రదించారని, షర్మిల యాటిట్యూడ్ గురించి అడిగి తెలుసుకుందట. అయితే, ఇటీవల కాలంలో నటి భూమిక ధోని, ఎంసీఏ వంటి వైవిధ్య చిత్రాల్లో నటిస్తూ సినీ జనాల అభిమానాన్ని చూరగొన్న విషయం తెలిసిందే. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడదియాలో వైరల్ అయింది.