గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ GHMC అరుదైన ఘనత సాధించింది.దేశంలోనే మొదటిసారిగా ఏసీ బస్టాప్ ను ఏర్పాటు చేసి రికార్డ్ సృష్టించింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగారంపై దృష్టి సారించింది. ఫ్లై ఓవర్లు, రోడ్డ మరమ్మతులతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం అయ్యప్ప సొసైటీ దగ్గర జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన రిజర్వాయర్‌ను ఆయన ప్రారంభించారు. శిల్పా రామం ఎదురుగా నిర్మించిన ఆధునిక ఏసీ బస్ షెల్టర్‌ను ప్రారంభించారు. దీంతో పాటు శిల్పారామం దగ్గర లగ్జరీ వాష్‌రూం, లూ కేఫ్‌ను కూడా ప్రారంభించారు మంత్రి కేటీఆర్.ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
MA&UD Minister @KTRTRS and Transport Minister Mahender Reddy inaugurated a Modern AC bus shelter at Shilparamam, Madhapur. Chevella MP @VishweshwarRed1, Serilingampally MLA @arekapudigandhi, Mayor @bonthurammohan, @CommissionrGHMC Janardhan Reddy participated in the program. 1/2 pic.twitter.com/KgerwQ07ro
— Min IT, Telangana (@MinIT_Telangana) May 22, 2018