శ్రద్ధాదాస్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టి చాలా ఏళ్లే అయింది. మెయిన్ హీరోయిన్ నుంచి ఐటెం గాల్ వరకు సపోర్టింగ్ రోల్ నుంచి వ్యాంప్ రోల్ వరకు చాలా పాత్రలే చేసింది శ్రద్ధాదాస్. గ్లామర్ ఒలకబోసినా కెరియర్‌లో బ్రేక్ మాత్రం దొరకలేదు. తనకు ఉన్న అందానంతటినీ ఒలకబోసినా లక్ కలిసి రాక శ్రద్ధాదాస్ లైమ్ లైట్‌లోకి రాలేక పోయింది.
ఇదిలా ఉండగా.. శ్రద్ధాదాస్ తాజాగా ఓ బోల్డ్ డెసీషన్ తీసుకుంది. అది కూడా తనలో ఉన్న పరిపూర్ణ నటిని ప్రపంచానికి పరిచయం చేయడమే. అందులో భాగంగా దీపక్ పాండే తీయనున్న షార్ట్‌ఫిల్మ్‌లో నటించేందుకు అంగీకరించింది. అయితే, ఆ షార్ట్‌ఫిల్మ్‌లో శ్రద్ధాదాస్ వేశ్యగా నటించనుంది. ఆ పాత్ర గురించి శ్రద్ధాదాస్ చెబుతూ.. పాత్ర ఛాలెంజింగ్‌గా ఉండటంతోనే ఒప్పుకున్నట్లు తెలిపింది. ఈ పాత్ర రెగ్యులర్ మూవీలా కాకుండా.. వైవిధ్యంగా ఉంటుందని, షార్ట్‌ఫిల్మ్ విడుదలయ్యాక ప్రతీ ఒక్కరు తనను ప్రశంసించడం ఖాయమంటూ కుండబద్దలు కొట్టింది.