వైఎస్ఆక్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే రామలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్ అడుగులో అడుగు వేస్తూ ప్రజలు నడుస్తున్నారు. వారి వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుంటున్నారు. జగన్ కుడా వారి సమస్యలను వింటూ.. నిశితంగా పరిశీలిస్తూ.. పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై విశ్లేషిస్తున్నారు.
అయితే, సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేశారు. ఏలూరు రోడ్డుపై నడుస్తున్న జగన్‌ను చూసిన ఓ బస్సు డ్రైవర్. అన్నా జగన్ అన్నా అంటూ పిలవ సాగాడు. ఆ పిలుపు విన్న జగన్ బస్సు డ్రైవర్ చెంతకు వెళ్లి షేకాండ్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఆ బస్సు డ్రైవర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జగన్‌తో సెల్ఫీ దిగాడు. అప్పటికే ఆ బస్సులో ఉన్న వైఎస్ఆర్ ఫోటోను బయటకు తీసి జగన్ చేత ఆటో గ్రాఫ్ తీసుకున్నారు. ఇలా జగన్‌ను కలిసిన ప్రతీ ఒక్కరు వారి అభిమానాన్ని చూపిస్తున్నారు.