ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డితో భేటీ అయ్యారా ..వీరిద్దరి మధ్య సంబంధాలున్నాయా ..అంటే అవును అనే అంటున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత కే పార్ధ సారథి .
ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డిని సింగపూర్ లో కలిశారా అని ఆయన ప్రశ్నించారు .గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించిన కంపెనీకే మొట్ట మొదట లీజుకిచ్చింది చంద్రబాబే అని ఆయన గుర్తు చేశారు.జనార్ధన్ రెడ్డినే కాదు చంద్రబాబు మీద కూడా విచారణ చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు .