తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఈ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహించిన కృష్ణా నది పునరుజ్జీవ జాతీయ సదస్సు కు హాజరయ్యారు .ఈ కార్యక్రమానికి వరల్డ్ వాటర్ కౌన్సిల్ గవర్నర్ పృథ్వీరాజ్ సింగ్, మంత్రి లక్ష్మారెడ్డి కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడారు.దేశంలోనే నాలుగో అతిపెద్ద నది కృష్ణ నది అని దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
నదుల పునర్జివానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ చేపట్టిందని చెప్పారు.మిషన్ కాకతీయ వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందన్నారు.అంతేకాకుండా చేపల ఉత్పత్తి కుడా 62 శాతం పెరిగిందని తెలిపారు.కృష్ణా నీటివినియోగంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో పలు ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించామని..వందేళ్లుగా నిరీక్షిస్తోన్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.నదులను కాపాడుకోకపోతే భాష్యత్ తరాలకు తీరని నష్టం జరుగుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు.