Home / ANDHRAPRADESH / ఆంధ్రప్రదేశ్ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త..!

ఆంధ్రప్రదేశ్ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త..!

ఏపీలోని డిగ్రీకళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. చదువుతోపాటే విద్యార్థులకు ఉపాధినిచ్చే కోర్సులపై శిక్షణనిచ్చి.. అనంతరం ఉద్యోగాలు కల్పించాలని ఏపీ కళాశాల విద్యాశాఖ, ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్‌డీసీ) నిర్ణయించాయి. ఉపాధి శిక్షణకు సంబంధించి సెంచూరియన్ వర్సిటీతో ఒప్పందం కూడా ఇప్పటికే పూర్తయింది. జూన్ నుంచి మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికచేసిన 30 కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా కళాశాలలను ‘కమ్యూనిటీ కళాశాలలు’గా పరిగణించనున్నారు.

విద్యార్థుల కోర్సుకు అనుగుణంగా వారికి ఉపాధి శిక్షణ ఉండనుంది. శిక్షణ ఇవ్వడంతోపాటు 70 శాతం ఉద్యోగాల కల్పనకు సెంచూరియన్ వర్సిటీనే బాధ్యత వహించనుంది. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా.. ప్రత్యేక సమయాల్లో విద్యార్థులకు ఉపాధి కోర్సులపై శిక్షణనిస్తారు. ఒక్కో కోర్సులో బ్యాచ్‌కు 30 మంది ఉంటారు. మొత్తంగా 30 కళాశాలల్లో దాదాపు 3,370 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. కోర్సుల ఆధారంగా దీన్ని డిగ్రీ రెండో సెమిస్టర్ తర్వాత లేదా మూడో ఏడాది విద్యార్థులకు ప్రతి సెమిస్టర్‌కు 30 గంటలపాటు శిక్షణ అందించనున్నారు. మూడేళ్ల డిగ్రీలోనే మూడు నెలలపాటు ఎంపికచేసిన సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది.
ఏ గ్రూపువారికి ఎందులో శిక్షణ..? 

  • బీఎస్సీ(ఎంపీసీ): యూనిట్ గేమింగ్ సాఫ్ట్‌వేర్
  • బీకాం: ట్యాలీ-అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్
  • బీఎస్సీ (లైఫ్‌సైన్సెస్): ఎక్స్‌రే, కార్డియో, ఆపరేషన్ థియేటర్, అనస్తీషియా టెక్నిషియన్
  • బీఏ: బీపీవో, డేటా ఎంట్రీ తదితర కోర్సుల్లో శిక్షణ ఉంటుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat