ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై రాష్ట్ర గిరిజన, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రతీ ప్రాంతంలోని గిరిజనులతో ముఖా ముఖి నిర్వహిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాన్వేషణ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే, వైఎస్ జగన్ గిరిజనులతో సమావేశం కావడాన్ని మంత్రి నక్కా ఆనందబాబు ఖండించారు. గిరిజనుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదంటూ జగన్ మోహన్‌రెడ్డిపై ఫైరయ్యారు. గిరిజనుల్లో ఉన్నవి ఎన్ని వర్ణాలు..? వారి విధి విధానాలేంటి..? ఎక్కడెక్కడ వారి ఆవాసాలున్నాయి..? కనీసం వారి జీవిన విధానం ఏమిటన్న విషయాలు కూడా తెలియని వైఎస్ జగన్ వారితో ముఖా ముఖి నిర్వహించడమేంటని ప్రశ్నించారు.
ఇటీవల ప్రమాదవ శాత్తు జరిగిన పడవ ప్రమాదంలో పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతే.. ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉన్న జగన్ విచారం వ్యక్తం చేయాల్సింది పోయి.. శవ రాజకీయాలు చేయడాన్ని మంత్రి ప్రశ్నించారు. ఇది నీ తండ్రి హయాం కాదు.. ఇకపై నీ హయాం అంటూ రానే రాదు అంటూ ఎద్దేవ చేశారు.