తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న పలు పథకాలకు ఇటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను ఆకర్షించడమే కాకుండా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా రాష్ట్రంలోని భద్రాది-కొత్తగూడెం జిల్లాలోని పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు గట్టి షాక్
తగిలింది.
నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న టీడీపీ పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు దాట్ల శివాజీ రాజు ,తెలుగు రైతు మండల అధ్యక్షుడు పి.సత్యనారాయణ,ఎంపీటీసీ సభ్యురాలు సుశీలతో పాటుగా రెండు వందల కుటుంబాలతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వంద కుటుంబాలు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో గులాబీ గూటికి చేరారు .
వీరందరికీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పారు .అయితే ఇప్పటికే అశ్వాపురం ఎంపీపీ కోల్లు మల్లారెడ్డి,నెల్లిపాక సొసైటీ అధ్యక్షుడు ఎం మల్లారెడ్డి తదితరులు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరారు ..