నల్లగొండ ,సూర్యాపేట జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త తెలిపారు.ఆ జిల్లా ప్రజల కోరిక మేరకు జిల్లా కేంద్రాల్లో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించిన వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలపై ఈ రోజు సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఈ రెండు కాలేజీల్లో 150 చొప్పున మెడికల్ సీట్లు కేటాయించనున్నారు. ఇప్పటికే మంజూరైన సిద్ధిపేట మెడికల్ కాలేజీలో ఈ ఏడాది నుంచే 150 అడ్మిషన్లు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.దీంతో మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
