ఆమె ఒక కుర్ర హీరో పక్కన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతికాలంలోనే స్టార్ స్టార్ హీరోల సరసన నటించి అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది మిల్క్ బ్యూటీ తమన్నా ..అయితే గత కొంతకాలంగా తమన్నాకు అవకాశాలు లేకుండా పోతున్నాయి.
గతంలో విడుదలైన బాహుబలి సిరిస్ తప్పా ఇంతవరకు అమ్మడు ఖాతాలో ఏ మూవీ లేకపోవడమే ఇందుకు నిదర్శనం .ప్రస్తుతం నందమూరి హీరో కళ్యాణ రామ్ సరసన నటిస్తున్న మూవీ తప్పా అమ్మడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు .అయితే అమ్మడుపై ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు ,దర్శకులు మోజు తీరడమే ఇందుకు ప్రధాన కారణమని సినీ వర్గాలు చెబుతున్నాయి.
గత కొంతకాలంగా కొత్త కొత్త అమ్మాయిలు హీరోయిన్లగా ఎంట్రీ ఇవ్వడం ..ఒకవైపు అందాలను అరబోయడమే కాకుండా మరోవైపు నటనలో అభినయంలో సత్తా చాటుతుండటంతో తమన్నా వెనకపడి పోతున్నారు .అందుకే అమ్మడుకు అవకాశాలు తగ్గుమొఖం పట్టాయి అని అంటున్నారు .అయితే అమ్మడు చేతిలో సినిమాలు లేక కష్టాల్లో పడింది అని సినీ వర్గాలు చెబుతున్నారు ..