సినీ పరిశ్రమలో పీపుల్ స్టార్‌గా పేరొందిన ఆర్.నారాయణ మూర్తి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తరువాత కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఆశగా చూపి కొన్నారన్నారు. ఇప్పుడు అదే సీన్ కర్ణాటక ఎన్నికల్లోను కనపడిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య కోసం ఇతర పార్టీ సభ్యులను కొనుగోలు చేయడం దారుణమన్నారు.
కాగా, ఆర్.నారాయణ మూర్తి నిర్మాతగా వ్యవహరిస్తూ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం అన్నదాత సుఖీభవ. అయితే, ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి వ్యవహారాలతో ప్రజాస్వామ్య వ్యవస్థ రేప్ కాబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో సమయంలో భయాన్ని కూడా కలుగ చేస్తుందన్నారు.