కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ ఏ పదవి ఉంటుందో ..ఉన్న పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితులను మనం గమనిస్తూనే ఉన్నాము.తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ,జేడీఎస్ పార్టీలు కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే .
త్వరలో ఏర్పడే ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ కు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ అధిష్టానం ఆలోచిస్తుందని సమాచారం .
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయాలను ఎదుర్కోవడంలో తన వంతు పాత్ర పోషించిన శివకుమార్ కు మంత్రి పదవివ్వడమే కాకుండా ఏకంగా రాష్ట్ర పీసీసీ పోస్టు కూడా ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని పార్టీ నేతలు
అంటున్నారు ..