2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కూటమికి మద్దతు పలికి ప్రజల ముందుకు వచ్చిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు ప్రజల నుంచి చీవాట్లు ఎదురవుతున్నారు. అందుకు గల కారణాలు అందరికీ తెలిసినవే. 2014 ఎన్నికలకు ముందే నారా చంద్రబాబు నాయుడుపై వందల సంఖ్యలో అవినీతి కేసులు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆ కేసుల వివరాలు తెలిసి జనసేన మద్దతు ఇచ్చిందా..? తెలియక ఇచ్చిందా..? అన్న విషయాలు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కే తెలియాలి.
అప్పటి వరకు వందల కేసులకే పరిమితమైన చంద్రబాబు.. ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాక ఆ కేసుల సంఖ్యను రోజు రోజు పెంచుకుంటూ పోతున్నారు. అంతేగాక, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేశాక నోటుకు ఓటు కేసులో ఇరుక్కుని, ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద మోకరిళ్లి ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టుపెట్టిన విషయం ప్రతీ ఒక్కరికీ విధితమే.
ఇలా అనేక కేసుల్లో ఇరుక్కున్న చంద్రబాబుకు ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ వత్తాసు పలకడం ఏంటని ప్రతీ ఒక్కరు జనసేన శ్రేణులను నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా ఆ పార్టీ అధినేతకే ఓ మహిళ ప్రశ్నల వర్షం కురిపించింది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగం నీవు ( పవన్ కల్యాణ్), చంద్రబాబు కలిసి మా ఊరుకు వచ్చారు. మీ ఊరికి అది చేస్తాం.. ఇది చేస్తామంటూ మా వద్ద ఓట్లు రాబట్టుకున్నారు. చివరకు ఓట్లు వేయించుకుని గెలిచిన తరువాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు.. నీవేమో (పవన్ కల్యాణ్) సినిమాలు చేసుకుంటూ కోట్ల సంపాదన గడించావు. చివరకు మేమే ఏమీ కాకుండా పోయామంటూ తన ఆవేదనను వెలిబుచ్చింది.
సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతున్నందున మళ్లీ మా ఊరు గుర్తొచ్చిందా..? ఇప్పుడు కూడా పోయినసారి చెప్పిన మాటలే, హామీలే చెబుతున్నావు, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే అమలు చేయలేదు. మళ్లీ కొత్తగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారా..? అంటూ ప్రశ్నించింది. ఆ మహిళ ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించడంతో ఖంగు తినడం పవన్ కల్యాణ్ వంతైంది.