ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు .నిన్న ఆదివారం పవన్ కళ్యాణ్ పోరాట యాత్రలో భాగంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో కల్సి కుట్రలు చేస్తున్నాయి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు .
నేను లేకపోతే గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టేవారా ..అసలు టీడీపీ నేతలు బుగ్గ కారులో తిరిగేవారా అని ప్రశ్నించారు .ఈరోజు చంద్రబాబును ఒకటే మాట అడుగుతున్నా ఆరోజు స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వమిచ్చిన ప్రత్యేక ఫ్యాకేజీపై సాక్షాత్తు అసెంబ్లీలో ఆమోదించింది ఎవరు ..పవన్ కళ్యాణ్ నా ..చంద్రబాబునా ..జనసేన నా ..టీడీపీ నా ..
కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడ్ని సన్మానించింది ఎవరు బాబునా ..పవన్ కళ్యాణ్ నా ..వాస్తవాలను కప్పి పుచ్చి మాట్లాడితే నమ్మడానికి ఇక్కడ ఉంది తెలుగు తమ్ముళ్ళు కాదు .ప్రజలు .రానున్న ఎన్నికల్లో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటి చేసి సత్తా చాటుతాం అని ఆయన అన్నారు ..