ఆపదలో ఉన్న అన్నా ఆదుకోండి అని ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేస్తే చాలు… వెంటనే స్పందించే తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో నిజమైన ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని ఒక ప్రముఖ జాతీయ అంగ్ల దినపత్రిక పేర్కొంది. అంతేకాదు ఈ లిస్ట్ లో నిజమైన ఫాలోవర్స్ ఉన్న రాజకీయ నేతల్లో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ముందువరుసలో ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కంటే సుష్మా ఖాతాలో ఒరిజినల్ ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉండగా.. ఆ తర్వాత స్థానంలో ఒరిజిల్ ఫాలోవర్స్ విషయంలో కేటీఆర్ ఉన్నారు. ట్విట్టర్-ఆడిట్ అనే టూల్ ఆధారంగా సదరు ఆంగ్లపత్రిక ఈ విషయాల్ని బయటపెట్టింది.
ఇక ఏపీ విషయానికి వస్తే..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతాలో 54శాతం మంది ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారు. దేశంలోని రాజకీయ నాయకులు అందర్లో అత్యథికంగా ఫేక్ ఫాలోవర్స్ ఉన్న నేతగా పవన్ రికార్డు సృష్టించాడు. టీ డీ పీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ఖాతాలో జగన్ కంటే ఎక్కువమంది ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబుతో పోలిస్తే, జగన్ ట్విట్టర్ ఖాతాలో ఒరిజినల్ ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారు . ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ ట్విట్టర్ ఖాతాలో కూడా 50శాతం మంది నకిలీ ఫాలోవర్స్ ఉన్నారు అని ఆ పత్రిక వెల్లడించింది.