ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ,ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ జగన్ పై పెండింగ్‌లో ఉన్న కేసుల్లో జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు. 2014 ఎన్నికల తరువాత వైఎస్ కుటుంబాన్ని ఓడించాలని ఏపీ ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. కొడాలి నాని, అనీల్ కుమార్ యాదవ్, రోజా, భూమన కరుణాకర్‌రెడ్డి వారివల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలికలు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నాడు వైఎస్ రాజవేఖర్‌రెడ్డి సహా 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అనేక ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల్లో ఏ ఒక్క కమిటీ కూడా చంద్రబాబు మీద నిరూపించలేకపోయిందన్నారు. అసలు చంద్రబాబును విమర్శించే అర్హత మీకెక్కడ ఉంది అంటూ జగన్మోహన్రెడ్డిపై ఫైరయ్యారు మంత్రి అచ్చెన్నాయుడు.