మీరు గుండె జబ్బులతో భాధపడుతున్నారా..?అయితే మీ డైట్‌లో చేపలను చేర్చుకోండి. కనీసం మీరు వారంలో రెండు సార్లు చేపలను తినండి. అలా తినడం వలన మీకు ఎలాంటి గుండె జబ్బులు రావు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన తాజా పరిశోధనలో తేలింది.చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.
రక్తనాళాల్లో కొవ్వు ఉండదు. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అయితే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే సాల్మన్, మాకరెల్, హెర్రింగ్, లేక్ ట్రౌట్, సార్డిన్స్, అల్బాకోర్ ట్యూనా వంటి చేపలను తింటే ఇంకా మంచి ఫలితం ఉంటుందని సైంటిస్టులు సూచిస్తున్నారు. వారంలో రెండు సార్లు మొత్తం కలిపి 100 గ్రాముల వరకు ఉడకబెట్టిన లేదా గ్రిల్ చేసిన చేపలను తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయని వారు చెబుతున్నారు.