ఆయన ఒక్క జిల్లా రాజకీయాలనే కాదు ఏకంగా రెండు నుండి మూడు జిల్లాల రాజకీయాలను ప్రభావితం చేయగల సీనియర్ నేత .అట్లాంటిది ఉమ్మడి ఏపీలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రిగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకున్నారు .అట్లాంటిది రాష్ట్ర విభజన తర్వాత పార్టీ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతతో
ఆయన ఓడిపోయారు .అయితే ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరారు .కానీ చేరి మూడేండ్లు అవుతున్న కానీ చేరిక సమయంలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన కమిట్మెంట్స్ ఒక్కటి కూడా నేరవేర్చకపోగా పరోక్షంగా తన సోదరుడు మరణానికి కారణమయ్యారు చంద్రబాబు.
ఇంతకూ ఎవరి గురించి ఈ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా ..నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్ .అయితే ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి ఇటివల అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెల్సిందే .అయితే ఆనం వివేకానంద రెడ్డి చనిపోయే ముందు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడ్ని అసలు నమ్మొద్దు.నమ్మించి మోసం చేయడంలో ఆయన సిద్ధహస్తుడు.తనని పిలిచి మరి ఎమ్మెల్యే గిరి ఇవ్వడమే కాకుండా ఏకంగా మంత్రి పదవిచ్చి ..తనకు ఆరో ప్రాణమైన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు.
అట్లాంటి తన మామయ్యకే వెన్నుపోటు పొడిచి మరి నడి రోడ్డు మీద చెప్పులు వేయించి మానసికంగా క్రుంగ దీసి చనిపోవడానికి పరోక్షంగా బాబు కారణమయ్యాడు .అందుకే ఆయన్ని నమ్మకు .నువ్వైనా ఇక నిజానిజాలు తెలుసుకొని రాజకీయ భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు అంట .అందుకే తన సోదరుడు చెప్పిన ప్రకారం తను వైసీపీలో చేరనున్నట్లు తన అనుచవర్గం దగ్గర చెబుతున్నారు .అందుకే ఇటివల ఏర్పాటు చేసిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమంలో ఏకంగా బహిరంగంగానే టీడీపీ అధిష్టానం ,చంద్రబాబుపై విమర్శల పర్వం కురిపించారు .అయితే ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్నా తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన పార్టీ మారడం ఖాయమంటున్నారు ..