ఓ కళాశాల యాజమాన్యం చూపించిన అత్యుత్సాహం వల్ల జరిగిన సంఘటన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… అలీగఢ్‌లోని ధర్మసమాజ్ డిగ్రీ కళాశాలలో ఈ సీసీ కెమెరాలు దర్శనమిచ్చాయి. దీంతో వెంటనే సీసీ కెమెరాలను తొలగించకపోతే ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.
అసలేజరిగిందంటే… స్టూడెంట్స్ పరీక్ష సమయంలో మూత్రశాలకు వెళ్లి చిట్టిలు తీసుకొచ్చి చూచిరాతలకు పాల్పడుతుంటారనే కారణంతో ధరమ్ సమాజ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ హేమ ప్రకాష్‌కు ఈ వినూత్న ఐడియా వచ్చింది. వెంటనే కాలేజీకి సంబంధించిన పురుషుల మూత్రశాలల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయించారు. టాయిలెట్లలో కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఏ స్టూడెంట్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నాడనేది తెలుసుకోవడం సులువు అని ప్రిన్సిపాల్ చెప్పారు. అంతేకాదు విద్యార్థుల వెనుకభాగం మాత్రమే కెమెరాలో రికార్డు అవుతుందని యాజయన్యం వివరణ ఇచ్చింది. టాయిలెట్‌లో సీసీ కెమెరాలపై విద్యార్థి, పౌరహక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. కళాశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాయి.