ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి (79) కాలిఫోర్నియా రాష్ట్రంలో (యు.ఎస్.ఏ)లో కుపర్టినో పట్టణంలో ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ సంబంధాలే ఇతి వృత్తంగా చేసిన అనేక రచనలు ఆమెకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయని సీఎం అన్నారు. తెలుగు సాహితీ వికాసానికి, నవలా ప్రక్రియను సుసంపన్నం చేయడానికి ఆమె చేసిన రచనలు ఉపయోగపడ్డాయని సీఎం అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం, ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు.
