ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ నగరాన్ని గూగల్ లో పెట్టింది తనే పలుమార్లు పలు సమావేశాల్లో అయినకాడికి కానికాడికి డబ్బా కొడుతూ ఇటు నెటిజన్లు ,ప్రతిపక్షాల నుండి విమర్శల వర్షానికి గురయ్యారు .
తాజాగా ఆయన రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఎండలను గురించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఆయన అధికారులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎండల తీవ్రతను తగ్గించడానికి ..ఉష్ణోగ్రతలను తగ్గించడానికి సరైన ప్రణాళికలు సిద్ధం చేయాలి ..
తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు .అంతే కాకుండా ఏకంగా రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలను పదిశాతానికి తగ్గించాలని ఆయన అన్నారు .అయితే ఎండలు ,ఉష్ణోగ్రతలు అనేవి వాతావరణానికి సంబంధించింది.ప్రకృతి సిద్ధమైన అప్పుడు మేమెలాతగ్గిస్తామని అధికారులు పెదవి విరిచారు ..