ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ,ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ సవాలును విసిరారు .ఏలూరులో నిర్వహించిన టీడీపీ పార్టీ మినీ మహానాడు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడానికి ..పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడానికే పాదయాత్ర అంటూ దొంగ యాత్రలు చేస్తున్నారు .దమ్ముంటే నాపై పోటి చేసి గెలవాలని ఆయన సవాలు విసిరారు .
