ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,నెల్లూరు బ్రదర్స్ గా పేరుగాంచిన ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే .
అయితే ఆనం వివేకానంద రెడ్డి చనిపోయే ముందు తన సోదరుడు ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి నమ్మలేని నిజాలు కొన్నిటిని చెప్పారు అని వార్తలు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .
ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి మరణించే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడ్ని అసలు నమ్మొద్దు.నమ్మించి మోసం చేయడంలో ఆయన సిద్ధహస్తుడు.తనని పిలిచి మరి ఎమ్మెల్యే గిరి ఇవ్వడమే కాకుండా ఏకంగా మంత్రి పదవిచ్చి ..తనకు ఆరో ప్రాణమైన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు.
అట్లాంటి తన మామయ్యకే వెన్నుపోటు పొడిచి మరి నడి రోడ్డు మీద చెప్పులు వేయించి మానసికంగా క్రుంగ దీసి చనిపోవడానికి పరోక్షంగా బాబు కారణమయ్యాడు .అందుకే ఆయన్ని నమ్మకు ..నువ్వైనా ఇక నిజానిజాలు తెలుసుకొని రాజకీయ భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు అని అన్నట్లు వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి .అయితే ఇటివల కాలంలో రామనారాయణ రెడ్డి వైసీపీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే ..