ఏపీలో రోజు రోజుకు రాజకీయం వెడెక్కుతుంది. 2019 లో లో జరిగే ఎన్నికలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల హాడవీడి అప్పుడే మొదలైనట్టుంది. ఇందులో బాగంగానే నెల్లూరు రాజకీయాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీకి వీలైనంత ఎక్కువ నష్టం చేయాలన్న కసితో ఉన్నాడు. తాను ఒక్కడే పార్టీ మారడం కాకుండా రాజకీయంగా ఓ స్థాయిలో ఉన్న నేతలను తనతో పార్టీ మారే ఆలోచనలో ఉన్నాడంట.
అందుకే తనకు సన్నిహితుడైన టీడీపీ పార్లమెంట్ ఇంఛార్జ్ ఆదాల ప్రభాకరరెడ్డితో కలిసి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశారని తెలుస్తోంది. , అయితే అప్పట్లో బాబు ప్రలోభాలకు, మోసపు మాటలకు మోసపోయామన్న బాధ ఇప్పుడు వేధిస్తోందని…….జగన్ విషయంలో నోరు జారామని అన్నట్టు తెలుస్తుంది. వైఎస్‌లు అంటే మొదటి నుంచీ అభిమానం ఉందని మొరపెట్టుకున్నారు. సీటు ఇచ్చే విషయంలో కూడా పట్టింపులేదని …..నెల్లూరు జిల్లాలో మళ్ళీ రాజకీయ ప్రాధాన్యం కావాలని విజయసాయితో ఆనం చెప్పుకొచ్చాడట. మరోవైపు రాజకీయంగా మేం బలహీనమయ్యాం అని తనకు కూడా తెలుసునని ఒప్పుకున్న ఆనం రామాయణరెడ్డి తనను కనుక పార్టీలో చేర్చుకునేటట్టయితే మరికొంత మంది నాయకులు, అనుచరులు అందరినీ తీసుకొస్తానని మాటిచ్చాడట. ఆదాల ప్రభాకరరెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇచ్చే పనయితే ఆయన కూడా వైసీపీలో చేరతాడు అని ఆనం చెప్పాడట. ఆనం, ఆదాల ప్రభాకరరెడ్డిలిద్దరూ కూడా నెల్లూరు జిల్లా టీడీపీ నేత సోమిరెడ్డికి శతృవులు. అందుకే ఇఫ్పుడు వీళ్ళిద్దరూ కలిసి సోమిరెడ్డి, చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు వ్యతిరేకంగా టీడీపీని దెబ్బకొట్టాలన్న కసితో వర్క్ చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.