స్మార్ట్‌ఫోన్ల వాడకం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్ లేకుండా నిమిషం కూడా ఉండలేకపోతున్నాం. అయితే ఏ ఫోన్‌కు అయినా స్టోరేజ్ పెద్ద సమస్య. ఎక్స్ పాండబుల్ మెమరీ సదుపాయం ఉన్నా ఇన్‌బిల్ట్ మెమరీనే చాలమంది కోరుకుంటున్నారు. సినిమాల పిచ్చోళ్లకైతే బోల్డు జీబీ స్టోరేజ్ కావాలి.అలాంటి వారి కోసం చైనాకు చెందిన ‘స్మార్టిసాన్’ అనే సంస్థ ‘ఆర్ 1’ పేరుతో కొత్త స్మార్టీని మార్కెట్‌లోకి తీసుక వచ్చింది . రెండు వెర్షన్లలో ఇది లభిస్తోంది. ఒక టీబీ(వెయ్యి జీబీలు) సామర్థ్యమున్న ఫోన్ ధర 92 ,000 (1390 డాలర్లు). 64 బీజీ మోడల్ ధర రూ. 36,000(549 డాలర్లు) ఉంది.
‘ఆర్ 1’ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు….
6.17 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
2,20మెగాపిక్సెల్ వెనుక కెమెరాలు
24 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా
స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్