- 70సంవత్సారాల పాలనలో మొదటిసారి అగ్రవర్ణాల గడప తొక్కిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు.
సమైక్యాంధ్ర రాష్ట్రం లో అత్యధికంగా పాలించిన మా రెడ్డి ల పాలన లో, పాలించిన నాయకులే అభివృద్ధి చెందిండ్రు కానీ రెడ్డి సామాజిక వర్గం ఎక్కడ కూడా పురోగతిని సాధించలేదు , కేవలం పాలించిన ముఖ్యమంత్రులు , మంత్రులు వారి కుటుంబాలే పురోగతి చెందినారు.ఇన్నేళ్ల పాలనలో పేద రెడ్డి , పేద రెడ్డి గానే , బలిసిన రెడ్డి, బలుస్తూనే పోయారు. ఆర్థికంగా వెనుకబడిన “ రెడ్డి” సామాజిక వర్గాన్ని పట్టించుకున్న నాయకులు గాని , ప్రభుత్వాలు లేవు . అటువంటిది వెనుకబడిన రెడ్డి ల తో పాటు ఇతర అగ్ర వర్గాలందరికి , అలాగే బడుగు , బలహీన , మైనారిటీ వర్గాలకు “రైతుబంధు “ పథకం క్రింద ఆర్థికంగా ఆదుకుని ఆర్ధిక అసమానలతలను తొలగించి “సకల జనుల” మన్ననలు పొందుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ .
అంతే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన అగ్ర వర్ణాలతో పాటు అన్ని వర్గాలకు “ కల్యాణ లక్ష్మి “ , “ ఆసరా పింఛను “ “స్కాలర్షిప్ “, ఇలా ఎన్నో పథకాలు వర్తింపచేసి కులమతాలకు అతీతంగా అన్నివర్గాలకు సమన్యాయం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి “ కేసీఆర్ “.
ఇలాగే ఇక ముందు కూడా విద్యార్థులకు , ఉద్యోగులకు మరియు ఇతరత్రా ఆర్థికంగా వెనుకబడిన వారిని కూడా ముందుకు తీసుకెళ్తారన్న భరోసా రేపటితరానికి కలిగించిన నాయకుడు కేసీఆర్.
పేరులో “రెడ్డి” ఉండటమే శాపంగా మారిన ఆ రోజుల్లో నాలాంటి యువకులు ఎంతో మంది ఉన్న ఊరు , కన్న తల్లిదండ్రులను వదిలి జీవనోపాధికి విదేశాలకు వలస వెళ్లి అక్కడ ఇప్పటికి రెండవ పౌరులుగా కాలం వెళ్లదీస్తున్నారు .ఇప్పటి పాలనలో నా లాంటి యువకులు దేశం కాదు కదా మన తెలంగాణ లోని ద్వితీయ శ్రేణి పట్టణాలు కూడా వదిలి వెళ్లాల్సిన అవసరం రాకుండా మన పాలన కొనసాగుతుంది .ఇదే పాలన మన దేశానికి అందించి ప్రపంచ పటం లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలని కెసిఆర్ గారి వైపు ప్రజలంతా ఆశతో చూస్తున్నారు ..వారి ఆశ నెరవేరాలని …
ఆశిస్తూ …
నాగేందర్ రెడ్డి కాసర్ల
ప్రెసిడెంట్
టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా