ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినతే పవన్ కళ్యాణ్ అని అందరికి తెల్సిందే .ఇదే అంశం గురించి ఇటు వైసీపీ అటు టీడీపీ పార్టీ నేతలు పలు మార్లు వ్యాఖ్యానించారు కూడా .
తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ పార్టీ గెలుపొంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఆయన అన్నారు .
రాష్ట్రంలో ఈ రోజు ఆదివారం శ్రీకాకుళం జిల్లా లో పోరాట యాత్ర ను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ ఆడవారు ,అక్క చెల్లెలు ,రైతులు ,యువత ,విద్యార్థులు సహకారంతో తాము అధికారంలోకి వస్తామని ఆయన అన్నారు ..