అదృష్టం అంటే కుమారస్వామి దే.. కుమారస్వామి మరోసారి కింగ్ కాబోతున్నారు. కుమారస్వామి అనే నేను.. అంటూ ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.కూటమి ముఖ్యమంత్రి గా జేడీఎస్ శాసనసభాపక్ష నేత HD కుమారస్వామి బాధ్యతలు చేపట్టనున్నారు.గతంలో బీజేపి తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి.. ఈసారి ఏకంగా కాంగ్రెస్ పార్టీ తో జట్టుకట్టారు.
బల నిరూపణకు ముందే యాడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వజుబాయ్ వాలా ఆహ్వానించారు . గవర్నర్ ఆహ్వానంతో శనివారం రాత్రి కుమారస్వామి రాజ్ భవన్ కు వెళ్లారు. ఈనెల 23న కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు. ముందుగా రేపే సోమవారం(మే-21) ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నా…. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. దీంతో ప్రమాణ స్వీకారం 23 కు వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తుంది.