జలీల్ ఖాన్ ప్రజా బలం ఎంత అంటే ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ చెప్తారు. అయినప్పటికీ వైఎస్ జగన్ మాత్రం జలీల్ ఖాన్‌ని చేరదీశాడు. ఎమ్మెల్యేను చేశాడు. అయితే చంద్రబాబు చూపించిన డబ్బుకు ఆశపడి జగన్‌కి హ్యాండ్ ఇచ్చాడు జలీల్ ఖాన్. టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత నుంచీ నమ్మి గెలిపించిన జగన్‌ని కించపరిచేలా అవాకులు చవాకులు చాలానే పేలాడు. చంద్రబాబు మెప్పు కోసం వైఎస్ జగన్‌ని విమర్శిస్తూ నానా పాట్లూ పడ్డాడు.
అయితే ఈ మద్య ముఖ్యమంత్రి చంద్రబాబు జలీల్ ఖాన్ నియోజకవర్గంలో సర్వే చేయించడంట. ఈ సర్వేలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌పై ప్రజల్లో ఏ స్థాయి వ్యతిరేకత ఉందో అర్థమైందట. అన్నింటికీ మించి బికాంలో ఫిజిక్స్ ఎపిసోడ్ తర్వాత నుంచీ ప్రజలందరూ కూడా జలీల్ ఖాన్‌ని సీరియస్‌గా తీసుకోవడం మానేశారన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ జలీల్ ఖాన్ గెలిచే అవకాశమే లేదని..అంతేకాదు సోంతంగా జలీల్ ఖాన్‌కి ఐదు వేల ఓట్లు కూడా తెచ్చుకునే సామర్థ్యం లేదని చంద్రబాబు సర్వేలో తేలిందట. అందుకే జలీల్ ఖాన్‌కి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పారట. అంతేకాదు చంద్రబాబు మెప్పు కోసం సీటు ఇచ్చి గెలిపించిన వైఎస్ జగన్‌ని తీవ్రస్థాయిలో విమర్శించినందుకు తగిన శాస్తే చేశారని……..ఇప్పుడు వైసీపీలోకి కూడా వెళ్ళే అవకాశం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు జలీల్ ఖాన్.