ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ కొనడానికి ప్రయత్నించడంపై ఘాటుగా స్పదించారు .
ఆయన కర్ణాటక రాష్ట్ర రాజకీయాలపై ఆయన స్పందిస్తూ కర్ణాటక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలిచింది .ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను డబ్బులిస్తాం.. మంత్రి పదవులిస్తామని బేరసాలు ఆడటం తప్పు అని అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది అని అయన అన్నారు .
ఈ తతంగాన్ని అంతా మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి చేయడం చాలా బాధాకరం ..ఆయన పేరు వింటేనే భయమేస్తుంది అని ఆయన అన్నారు