Home / MOVIES / యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ విడుదల

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ విడుదల

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈరోజు తన 35వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా మా దరువు.కామ్ నుండి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కు పుట్టినరోజు శుభకాంక్షలు. అలాగే ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత..వీర రాఘవ’ సీనిమా మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. నిన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో తారక్‌ సిక్స్‌ప్యాక్‌ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌లో తారక్‌, క హీరోయిన్ పూజా హెగ్డే ఓ గట్టుపై కూర్చుని ఒకరినొకరు చూసుకోవడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్‌ చిత్తూరు యువకుడిగా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘జై లవకుశ’ హిట్‌ తర్వాత తారక్‌ నటిస్తున్న చిత్రమిది. దీని తర్వాత ఆయన ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కించనున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మరో హీరో.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat