కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా నిన్న శుక్రవారం ఆ రాష్ట్ర రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ పార్టీ పక్ష నేత యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి .మరికొద్ది గంటల్లోనే బల నిరూపణ పరీక్షకు సిద్ధమవుతుండగా ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలు బీజేపీ వర్గాల్లో కలవరం చెలరేగుతుంది .
ఒకవేళ సభలో బల నిరూపణ చేయాల్సి వస్తే యడ్డీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది .ఇప్పటికే యడ్యూరప్ప తన రాజీనామా లేఖను కూడా సిద్ధం చేసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ ,జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు అని ఇప్పటికే పలు ఆడియో టేపులు బయటకురావడంతో యడ్డీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .
ఇటివల విడుదలయిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ ముప్పై ఎనిమిది ,బీజేపీ పార్టీ నూట నాలుగు ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే .అయితే నియమాల ప్రకారం పెద్ద పార్టీ అవతరించిన బీజేపీ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ ఆహ్వానించిన సంగతి తెల్సిందే .