ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీకి వంద నుంచి 110 లోపు, అలాగే, కాంగ్రెస్ 70 నుంచి 80 లోపు, జేడీఎస్ 30 నుంచి 40 లోపు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంటుందని తేల్చి చెప్పింది ఏపీ ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే. అయితే, అచ్చం లగడపాటి రాజగోపాల్ చెప్పిన విధంగానే కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 2 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్ల సంఖ్య ఎవరికీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చారు.
ఇలా తన సర్వే ద్వారా కర్ణాటక ఎన్నికలు పూర్తవ్వక ముందే ఫలితాలను చెప్పిన లగడపాటి రాజగోపాల్.. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా లగడపాటి రాజగోపాల్ తాజాగా తన అనుచర వర్గంతో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే, ఏపీలో అధికారపార్టీ టీడీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో సహా కాంగ్రెస్, జనసేన పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నాలుగు పార్టీల్లో ప్రధానంగా అధికార తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మధ్యనే హోరా హోరీ పోరు జరగనుందని లగడపాటి రాజగోపాల్ సర్వే వెల్లడించింది.
ఇప్పటికే పలు సర్వే సంస్థలు చేసిన సర్వేల్లో 2019లో వైసీపీకే అధికారం సొంతం కానుందని తేల్చగా.. లగడపాటి రాజగోపాల్ సర్వే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరుమీద నడకేనని తేల్చి చెప్పింది. లగడపాటి సర్వేలో అధికార పార్టీ టీడీపీ ప్రజల వ్యతిరేకతతో ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. 2014 ఎన్నికల్లో అమలుకాని, మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు.. తనమీద ఉన్న కేసులకు భయపడి కేంద్రంతో కలిసి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారని, మరోపక్క రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌కు ప్రజలు నుంచి తీవ్ర నిరాశే మిగిలిందని లగడపాటి సర్వే పేర్కొంది.
ఇక జనసేన పార్టీ గురించి లగడపాటి సర్వే ఇలా చెప్పుకొచ్చింది. స్పష్టమైన హామీలు, నిలకడగల నిర్ణయాలు తీసుకోని అధినాయకత్వంపై జనసేన కార్యకర్తలతోపాటు ప్రజలు తీవ్ర విముఖత చూపుతున్నారని, అయితే, పలు అసెంబ్లీ స్థానాల్లో జనసేన పట్టు సాధించేందుకు అవకాశం ఉందని లగడపాటి సర్వే తెలిపింది.
అయితే, లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రకారం ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ, జనసేన, కాంగ్రెస్ గెలుచుకోబోయే అసెంబ్లీ సీట్ల సంఖ్య ఇలా ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు – 175
శ్రీకాకుళం మొత్తం సీట్లు 10కాగా, అందులో..
టీడీపీ : 4
వైస్సార్సీపీ : 5
జనసేన : 1
కాంగ్రెస్ : 0
విజయనగరం మొత్తం సీట్లు 9 కాగా , అందులో..
టీడీపీ : 2
వైస్సార్సీపీ : 5
జనసేన : 2
కాంగ్రెస్ : 0
విశాఖపట్నం మొత్తం సీట్లు 15కాగా, అందులో..
టీడీపీ : 6
వైస్సార్సీపీ : 8
జనసేన : 1
కాంగ్రెస్ : 0
తూర్పుగోదావరి మొత్తం సీట్లు 19 కాగా, అందులో..
టీడీపీ : 2
వైస్సార్సీపీ : 9
జనసేన : 8
కాంగ్రెస్ : 0
పశ్చిమగోదావరి మొత్తం సీట్లు 15కాగా, అందులో..
టీడీపీ : 5
వైస్సార్సీపీ : 5
జనసేన : 5
కాంగ్రెస్ : 0
కృష్ణ మొత్తం సీట్లు 16 కాగా, అందులో ..
టీడీపీ : 5
వైస్సార్సీపీ : 11
జనసేన : 0
కాంగ్రెస్ : 0
గుంటూరు మొత్తం సీట్లు 17 కాగా, అందులో..
టీడీపీ : 10
వైస్సార్సీపీ : 7
జనసేన : 0
కాంగ్రెస్ : 0
.ప్రకాశం మొత్తం సీట్లు 12 కాగా, అందులో..
టీడీపీ : 3
వైస్సార్సీపీ : 8
జనసేన : 1
కాంగ్రెస్ : 0
నెల్లూరు మొత్తం సీట్లు 10కాగా, అందులో..
టీడీపీ : 2
వైస్సార్సీపీ : 7
జనసేన : 1
కాంగ్రెస్ : 0
కడప మొత్తం సీట్లు 10కాగా, అందులో..
టీడీపీ : 0
వైస్సార్సీపీ : 10
జనసేన : 0
కాంగ్రెస్ : 0
కర్నూల్ మొత్తం సీట్లు 14 కాగా, అందులో..
టీడీపీ : 4
వైస్సార్సీపీ : 10
జనసేన : 0
కాంగ్రెస్ : 0
అనంతపురం మొత్తం సీట్లు 14కాగా, అందులో..
టీడీపీ : 4
వైస్సార్సీపీ : 10
జనసేన : 0
కాంగ్రెస్ : 0
చిత్తూర్ మొత్తం సీట్లు 14కాగా, అందులో
టీడీపీ : 4
వైస్సార్సీపీ : 10
జనసేన : 0
కాంగ్రెస్ : 0
మొత్తంశాసనసభ స్థానాలు :- 175
టీడీపీ : 51
వైస్సార్సీపీ : 105
జనసేన : 19
కాంగ్రెస్ : 0
ఇప్పుడీ లగడపాటి రాజగోపాల్ సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే వైఎస్ జగన్ కాబోయే సీఎం అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పై ఫలితాలు వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా రావడానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రజల్లో వ్యతిరేకత, అలాగే, ప్రత్యేక హోదా అంశంపై పట్టువీడని విక్రమార్కుడిలా పోరాడుతూ ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజల మధ్యన ఉంటున్న జగన్‌కు.. ప్రజాదారణ పెరిగిందని లగడపాటి రాజగోపాల్ సర్వే తేల్చేసింది. ఈ కథనంపై వైసీపీ శ్రేణులు వారి అభిప్రాయాన్ని, కామెంట్లు, షేర్లు ద్వారా తెలుపుతున్నారు.