దేశం అంతటా ఎంతో ఉత్సకతతో ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఎవరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో గవర్నర్ వాజ్ భాయ్ బీజేపీ పార్టీను నూట నాలుగు స్థానాలను దక్కించుకోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ ఆహ్వానించారు .దీంతో బీజేపీ పక్ష నేతగా ఎన్నికైన మాజీ ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప కర్ణాటక ప్రోటెం స్పీకర్ గా కేజీ బొపయ్యను నియమించాడు.
దీనిపై కాంగ్రెస్ ,జేడీఎస్ మిత్రపక్షాలు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.ఈ క్రమంలో కర్నాటక ప్రోటెమ్ స్పీకర్ గా ఎన్నికైన కేజీ బోపయ్యకు గ్రీన్ సిగ్నల్ లభించింది. బోపయ్యను ప్రోటెమ్ స్పీకర్ గా ఉంచరాదన్న కాంగ్రెస్,జెడిఎస్ ల వాదనను సుప్రీం తోసిపుచ్చింది. ఈ పిటిసన్ ను కొనసాగించాలంటే బోపయ్య వివరణ అడగవలసి ఉంటుందని కోర్టు అబిప్రాయపడింది. అప్పుడు బలపరీక్షను వాయిదా వేయవలసి ఉంటుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ప్రోటెమ్ స్పీకర్ విషయంలో సంప్రదాయాలు వేరు, నిబందనలు వేరు అని కోర్టు అబిప్రాయపడింది. ప్రోటెమ్ స్పీకర్ ఆద్వర్యంలోనే బలపరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది.మొత్తం అసెంబ్లీ సమావేశం ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని కోర్టుకు ఏజీ చెప్పారు. అయితే కాంగ్రెస్ న్యాయవాది సింగ్వి మాట్లాడుతూ తమ పిటిషన్ పై విచారణ చేసినందుకు దన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.అయితే అసెంబ్లీ సమావేశం పూర్తి పారదర్శకగా ఉంటుందని భావిస్తున్నామని,అందువల్ల ఈ పిటిషన్ విచారణ కొనసాగించవలసిన అవసరం లేదని భావిస్తున్నామని అన్నారు.