రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి కే తారకరామారావు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలంగా తీరని కలగా ఉన్న వడ్డెర విషయంలో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే వడ్డెర సోసైటీలకు, ఎస్సీ యస్టీ యువకులతో ఏర్పడే సోసైటీలకు మాన్యూఫాక్చర్ సాండ్ ప్లాంట్ల ఏర్పాట్లుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇసుక రీచుల నుంచి వస్తున్న సహాజ ఇసుక బదులు మాన్యూఫాక్ఛరింగ్ సాండ్ వినియోగం పెంచాల్సిన అవసరం ఉందని, అయితే ఈ మాన్యూఫాక్చరింగ్ సాండ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
వివిధ వర్గాల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న ప్రభుత్వం ఈ సాండ్ ప్లాంట ఏర్పాటులో సాంప్రదాయికంగా ఇదే పనిలో ఉన్న వడ్డెరలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గత కొన్నేళ్లలో వచ్చిన స్టోన్ క్రషర్ల వంటి వాటి ద్వారా వడ్డెరల ఉపాది పోయిందని, వారికి ఈ విధంగా అయిన ఉపాధి దొరుకే అవకాశం ఉందన్నారు. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ యువకులు సైతం మ్యాన్యూఫాక్చరింగ్ సాండ్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు సోసైటీలుగా ఏర్పడి ముందుకు వస్తే వారికి ప్రభుత్వ సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఇలా స్వయం ఉపాది కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, ఉప ప్రణాళికల ద్వారా అర్ధిక సహాయం, ప్రభుత్వం తరపున శిక్షణ, రుణాలు ఇవ్వడం ద్వారా వారి ప్రభుత్వం పూర్తి సహాకారం అందిస్తుందన్నారు. త్వరలోనే రంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా మాన్యూఫాక్చరింగ్ సాండ్ తయారీ ప్లాంటను వడ్డెరాలు, యస్సీ, యస్టీల అద్వర్వంలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.