మరో కొద్ది గంటల్లో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఇరవై మంది ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు.ఈ క్రమంలో ప్రస్తుతం అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పార్టీ బలపరీక్షలో నెగ్గుతుందా లేదా అన్నది సస్పెన్స్ లో ఉంది .ఈ క్రమంలో ప్రస్తుతం అధికారాన్ని చేపట్టి బల నిరూపణ చేయాల్సిన బీజేపీ పార్టీకి మద్దతుగా మరో ఇరవై మంది ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు అని రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి .
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పద్దెనిమిది మంది లింగాయత్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ,జేడీఎస్ పార్టీకి చెందిన అదే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బయటకు రావాలని డిసైడ్ అయ్యారు అంట .బలపరీక్ష సమయంలో సాయంత్రం నాలుగు గంటలకు విధాన సౌద్ లో జరగనున్న బలపరీక్షలో బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారు అని కర్ణాటక రాష్ట్ర రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే సాయంత్రం నాలుగు గంటలవరకు ఎదురుచూడాల్సిందే మరి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారో ..ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో..!