ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ కు అర్జెంట్ కాల్..!!
నెల్లూరు జిల్లా రాజకీయాలంటే గతం వరకు ఆనం బ్రదర్సే గుర్తుకు వచ్చే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నెల్లూరు అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అనే చెప్పుకునేంత వరకు వెళ్లింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, అలాగే దమ్మున్న నేతగా అనీల్ కుమార్ యాదవ్ ఎదుగుతున్నారు. ప్రజా సమస్యలపై దూకుడుగా వ్యవహరిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తున్న అనీల్ కుమార్ యాదవ్‌కు ప్రత్యర్థి పార్టీలు ఈర్ష్య పడేంతలా జిల్లాలో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది.
వైసీపీ నుంచి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఢీ. .అంటే ఢీ అంటూ పోరాడే నాయకుల్లో ఒకరు కొడాలి నాని, మరొకరు రోజా కాగా, ఆ లిస్టులో అనీల్ కుమార్ యాదవ్ పేరు ఉండాల్సిందే. అలాంటి యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు మరో యంగ్ అండ్ డైనమిక్ నాయకుడితో జోడీ కడితే ఎలా ఉంటుంది. రాజకీయం రంజుగా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. అలాంటి అనీల్ యాదవ్ జగన్‌కు విధేయుడిగా ఉంటున్నారు. డాక్టర్ చదివినప్పటికీ.. రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం తన తండ్రి అని చెప్పుకునే అనీల్ కుమార్ యాదవ్ ప్రతీ ఒక్క బిడ్డ గవర్నమెంట్ స్కూల్లో చదవాలనే ఆశయంతో.. ఆ దిశగా కార్యాచరణను రూపొందిస్తూ ముందుకెళుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేని అధికార తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలికను తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. వైసీపీ కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా నుంచి టీడీపీ మంత్రులుగా ఉన్న నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో మకాం వేశారని, 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో తమకు డబ్బు మూటచూపిస్తున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే, ఏకంగా టీడీపీ మంత్రులే రంగంలోకి దిగి డబ్బు మూటలు చూపెడుతున్నా.. తామంతా వైఎస్ జగన్ వెంటే ఉంటామంటూ నెల్లూరు నగర వైసీపీ శ్రేణులు కంఠాపథంగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల సమస్యలపై పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న విషయం తెలిసిందే. టీడీపీ మంత్రుల కుట్రలను తెలుసుకున్న వైఎస్ జగన్ వెంటనే ఎమ్మెల్యే అనీల్‌కు ఫోన్ చేసి.. నెల్లూరు నగర పార్టీ పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. అందుకు స్పందించిన అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగరం మాత్రమే కాదు… త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ప్రజలంతా వైసీపీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ నేతల ప్రలోభాలకు మన పార్టీ శ్రేణులు తలొగ్గేది లేదంటూ వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే అనీల్ కుమార్ ఫోన్‌లో చెప్పారు.
ఏదేమైనా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ఎదుగుతున్న ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ టీడీపీ పన్నుతున్న కుట్రలను ఎప్పటికప్పుడు పసిగడుగుతూ తిప్పికొడుతున్నారు. ఇలా నిరంతరం వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్న అనీల్ కుమార్ యాదవ్‌పై, అలాగే వైఎస్ జగన్‌పై నెట్టింట్లో కామెంట్ల వర్షం కురుస్తోంది.