మొత్తానికి యడ్యూరప్ప తన కోరికను నెరవేర్చుకున్నారు. ఎన్నికల ముందునుంచే మే 17 న ఉదయం నేను సీ ఎం గా ప్రమాణం చేస్తా అని ముందు చెప్పినట్టుగానే నేడు కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూభాయ్ ఆయనతో ప్రమాణం చేయించారు.
#Bengaluru: BJP's BS Yeddyurappa takes oath as the Chief Minister of Karnataka. pic.twitter.com/f33w4GZjrS
— ANI (@ANI) May 17, 2018
“బీఎస్ యడ్యూరప్ప అనే నేను…” అంటూ ఆయన ప్రమాణ స్వీకారం కన్నడలో సాగింది.అయితే పెద్దగా హంగు, ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమం త్వరగానే ముగిసింది. ఆపై ఆయన సీఎంగా బాధ్యతలను స్వీకరిస్తూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.
#Karnataka: BS Yeddyurappa arrives at Raj Bhavan, to take oath as Karnataka Chief Minister shortly pic.twitter.com/IQLSPrGz2u
— ANI (@ANI) May 17, 2018