కర్ణాటక రాజకీయ సస్పెన్స్‌కు తాత్కాలికంగా తెరపడింది. బుధవారం చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటూ బీజేపీ పక్షనేత యడ్యూరప్పను గవర్నర్ వజూభాయ్ వాలా ఆహ్వానించారు.దీంతో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ రోజు ఉదయం 9:30 గంటలకు రాజ్‌భవన్ ప్రాంగణంలోనే యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తదితర ముఖ్యులు హాజరవుతారని సమాచారం.గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న యడ్యూరప్ప.. మే27లోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ సూచించారు. ఆ తర్వాతే మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు.మాజీ అటార్నీ జనరల్‌లు సోలీ సొరాబ్జీ, ముకుల్ రోహత్గీలను సంప్రదించిన తర్వాతే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.