కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప ఈ రోజు ప్రమాణం చేయనున్న క్రమంలో ఆయన గురించి మీకు తెలియని విషయాలు..
- యడ్యూరప్ప తల్లిదండ్రులు సిద్ధిలింగప్ప, పుట్టథాయమ్మ.
- యడ్యూరప్ప భార్య పేరు మైత్రిదేవి.ఆయనకు ఇద్దరు కుమారులు (రాఘవేంద్ర, విజయేంద్ర) మరియు ముగ్గురు కుమారైలు (అరుణాదేవి, పద్మావతి, ఉమాదేవి)
- 2004లో యడ్యూరప్ప భార్య మైత్రిదేవి ప్రమాదావశాత్తు మరణించింది.
- యడ్యూరప్ప అసలుపేరు యడియూరప్ప .
- 1943, ఫిబ్రవరి 27న మాండ్యా జిల్లాలోని బూకనాకెరెలో యడ్యూరప్ప జన్మించాడు.
- యడ్యూరప్ప ఇంటర్ వరకు చదివారు.
- 1970 నుండి యడ్యూరప్ప రాజకీయ జీవితం ఆరంభం.
- 1983లో శికారిపుర నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.
- 1988లో కర్ణాటక బీజేపి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- 1994లో అసెంబ్లీ లో విపక్ష నేతగా పనిచేశారు.1999 ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయారు.
- 2007లో యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
- 2008, మే 30న యడ్యూరప్ప రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
- యడ్యూరప్ప 7 సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.
- కర్ణాటక 23 వ ముఖ్యమంత్రిగా మే 17 ,2018 న ప్రమాణస్వీకారం చేశారు.