వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది కొడాలి నాని పేరే. ఆ తరువాతే ఏదైనా. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, దమ్మున్న నేతగా కొడాలి నాని ఎదుగుతున్నారు. ప్రజా సమస్యలపై దూకుడుగా వ్యవహరిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తున్న కొడాలి నానికి ప్రత్యర్థి పార్టీలు ఈర్ష్య పడేంతలా రాష్ట్రంలో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది.
వైసీపీ నుంచి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఢీ. .అంటే ఢీ అంటూ పోరాడే నాయకుల్లో ఒకరు నగరి ఎమ్మెల్యే రోజా కాగా, మరొకరు నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్, ఆ లిస్టులో గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని పేరు కూడా ప్రథమంగా ఉండాల్సిందే. అలాంటి యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు మరో యంగ్ అండ్ డైనమిక్ నాయకుడితో జోడీ కడితే ఎలా ఉంటుంది. రాజకీయం రంజుగా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. అలాంటి కొడాలి నాని ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి వీర విధేయుడిగా ఉంటున్నారు.
ఈ తరుణంలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇటీవల ప్రజాక్షేత్రంలో గెలవలేక.. ఎమ్మెల్సీగా నిలబడి మంత్రిగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ నాయుడును రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేయించి.. టీడీపీ జెండా ఎగురవేయాలని టీడీపీ భావిస్తోంది. ఆ నేపథ్యంలోనే గుడివాడ వైసీపీ నేతలకు పలువురు టీడీపీ సీనియర్ నేతలు డబ్బు మూటలు చూపిస్తూ వల వేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ ప్రలోభాలన్నిటినీ కొడాలి నాని దమ్మున్న నేతగా ఎదుర్కొంటున్నారు.
ఆ సందర్భంలోనే.. “చంద్రబాబు, అయిన తనయుడు లోకేష్‌కు దమ్ముంటే తనపై నిలబడి గెలవాలని .నేను ఉండనవసరంలేదు ..నా కటౌట్ పెడితే దానికి ప్రజలు ఓట్లు వేసి నన్ను గెలిపించి తీరుతారు. దమ్ముంటే నాపై నిలబడి గెలవాలని కొడాలి నాని చంద్రబాబు, లోకేష్‌లకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ సీఎం కాగానే.. చంద్రాబు పాల్పడ్డ అవినీతి చిట్టాలన్నిటిని ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చి.. టీడీపీ నేతలను శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపుతామన్నారు.
అయితే, రాజకీయంగా సీనియర్ నాయకుడి స్థానాన్ని పొందిన కొడాలి నాని.. తన అనుభవాలను, అలాగే, వైఎస్ జగన్ సలహా మేరకు అధికార పార్టీ పన్నుతున్న కుట్రలను ఎలా ఎదుర్కోవాలో..? ఎలా చిత్తు చేయాలో..? అన్న విషయాలను వైసీపీ కార్యకర్తలకు, అలాగే నాయకులకు చెబుతూ వైసీపీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళుతున్నారు కొడాలి నాని. ఇలా జగన్ సలహాలను పాటిస్తూ.. వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్న కొడాలి నాని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.